చారిత్రకతను దృష్టిలో ఉంచుకోండి | Keep in mind that the historicity | Sakshi
Sakshi News home page

చారిత్రకతను దృష్టిలో ఉంచుకోండి

Oct 14 2015 1:36 AM | Updated on Mar 28 2018 11:11 AM

చారిత్రకతను దృష్టిలో ఉంచుకోండి - Sakshi

చారిత్రకతను దృష్టిలో ఉంచుకోండి

చారిత్రక పరిస్థితులను దృష్టిలో ఉం చుకుని జిల్లాల విభజన జరగాలని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

ఆదిబట్ల: చారిత్రక పరిస్థితులను దృష్టిలో ఉం చుకుని జిల్లాల విభజన జరగాలని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్‌లో తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కాకి కుమార్ స్మారకార్థం నిర్మించిన తెలంగాణ తల్లి విగ్రహా న్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రంగారెడ్డిని తూర్పు, పశ్చిమ జిల్లాలుగా విభజిస్తే బాగుం టుందని అభిప్రాయపడ్డారు. గతంలో తెలుగుతల్లిని కీర్తిస్తూ పాడిన పాటల్లో తెలంగాణకు స్థానం ఉండేది కాదన్నారు. మన కవులు, మేధావులు, శిల్పులకు వచ్చిన ఆలోచనే తెలంగాణ తల్లికి ప్రతిరూపం అని వివరించారు. 

స్థానికంగా ఉన్న కంపెనీల్లో సూపర్‌వైజర్ నుంచి అన్నిస్థాయిల కేడర్ల వరకు 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఉద్యమ సమయంలో డిమాండ్ చేశామన్నారు. అయితే రాష్ట్రం వచ్చాక పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదన్నారు.  రాష్ట్రం లో ఉన్న పలు కంపెనీలు స్థానికులకు ఉపాధి కల్పిస్తే ఆ కంపెనీలకు స్థిరత్వం లభిస్తుందని, రక్షణ దొరుకుతుందన్నారు. ఉత్తరాంచల్, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఏదైనా కంపెనీకి ప్రభుత్వం స్థలం ఇచ్చేముందు అగ్రిమెం ట్‌లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే అని జీవో ఉంటుందని, ఇలాంటి జీవోలు తెలంగాణలోనూ అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement