విద్యార్థి గల్లంతైనా పట్టించుకోరా? | Jamadulapalem villagers concern | Sakshi
Sakshi News home page

విద్యార్థి గల్లంతైనా పట్టించుకోరా?

Nov 29 2016 2:47 AM | Updated on Nov 9 2018 5:02 PM

విద్యార్థి గల్లంతైనా పట్టించుకోరా? - Sakshi

విద్యార్థి గల్లంతైనా పట్టించుకోరా?

కశింకోట మండలం జమాదులపాలెం గ్రామానికి చెందిన ఒమ్మి శ్రీను అనే విద్యార్థి శారదానదిలో గల్లంతైన విషయం తెలిసినా

అధికారుల తీరుకు నిరసనగా జమాదులపాలెం గ్రామస్తుల ఆందోళన
ఎట్టకేలకు గాలింపు చర్యలు... మృతదేహం లభ్యం
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వినతి

అనకాపల్లి రూరల్ : కశింకోట మండలం జమాదులపాలెం గ్రామానికి చెందిన ఒమ్మి శ్రీను అనే విద్యార్థి శారదానదిలో గల్లంతైన విషయం తెలిసినా అధికారులు వెంటనే స్పందించలేదని ఆగ్రహిస్తూ ఆ గ్రామస్తులు సోమవారం తుమ్మపాల ఏలేరు కాలువ వద్ద అనకాపల్లి - చోడవరం రహదారిపై బైటాయించారు. కశింకోట ఎంపీటీసీ కరక సోమునాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో ఆయన మాట్లాడుతూ గాంధీనగరం బీసీ వసతిగృహంలో 9వ తరగతి చదువుతున్న ఒమ్మి శ్రీను (14)ఆదివారం సెలవు కావడంతో స్నానం చేసేందుకు ఏలే రు కాలువలో దిగి గల్లంతయ్యాడన్నారు. ఈ సంఘటన జరిగి 24 గంటలు దాటినా పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. హాస్టల్ వార్డెన్‌కు సమాచారం తెలిసినా కనీసం బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదని ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినా సమయానికి ఎవరూ రాలేదన్నారు.

వస తి గృహంలో సరైన పర్యవేక్షణ లేకే వి ద్యార్థి మరణించాడని, బాధిత విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో తహశీల్దార్ కృష్ణమూర్తి, ఎస్‌ఐ రామారావు, క్రైం ఎస్‌ఐ వెంకటేశ్వరరావు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఆందోళనలో మాజీ ఎంపీటీసీ కరక రాజు, కరక బాబూరావు, సంపతిపురం సర్పంచ్ నంబారు శ్రీను, రమణ, పల్లా శ్రీను, పంచదార్ల సూరిబాబు, మొల్లి వెంకటరమణ పాల్గొన్నారు.  

మృతదేహం లభ్యం: ఆందోళన నేపథ్యం లో అధికారుల్లో చలనం వచ్చింది. జాలర్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. ఆర్డీవో పద్మావతితోపా టు పోలీసులు వచ్చి పరిశీలించారు. గ్రామ స్తులతో మాట్లాడి మృతదేమాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. ఒకే ఒక్క కుమారుడు విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి తల్లి అప్పలనర్స కుప్పకూలిపోరుుంది. ఆరు నెలల క్రితం భర్త, ఇప్పుడు కొడుకు మృతి చెందడంతో ఆమె ఒంటరైంది. జమాదులపాలెం గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. అధికారులు ఆమెకు ఎంతోకొంత న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement