ఏ తల్లి కన్న కవలలో కానీ బొడ్డూడకుండానే వాగులో మృతశిశువులుగా కనిపించారు.
ఏ తల్లి కన్న కవలలో కానీ బొడ్డూడకుండానే వాగులో మృతశిశువులుగా కనిపించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడు సమీపంలో కలకలం రేపిన ఈ ఘటన వివరాలు...ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికివచ్చిన కొందరికి ఏడుమంగళంవాగు బ్రిడ్జి కింద ఉన్న నీటిలో తేలియాడుతూ ఇద్దరు ఆడశిశువుల మృతదేహాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని పోలీసులు సమాచారం అందించారు. రూరల్ ఎస్.ఐ.లు సురేంద్రబాబు, జె.సిహెచ్.వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. చుట్టుపక్కల గ్రామాల్లోని ఆస్పత్రుల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.