చీకటిబతుకున వేగుచుక్కలా.. | blind men marriage | Sakshi
Sakshi News home page

చీకటిబతుకున వేగుచుక్కలా..

Aug 19 2016 11:20 PM | Updated on Apr 3 2019 4:04 PM

చీకటిబతుకున వేగుచుక్కలా.. - Sakshi

చీకటిబతుకున వేగుచుక్కలా..

‘వెలుగుకు నోచని నీ బతుకులో వేగుచుక్కనవుతా.. కొత్త వేకువనవుతా.. నీ కనులు చూడలేకపోయినా..నేనే నీ చూపై ఈ లోకాన్ని చూపిస్తా.. జీవితమంతా నీ తోడైనీడై ఉంటా..’ అంటూ ఓ యువతి అంధుడికి జీవితభాగస్వామి అయింది. రాజమహేంద్రవరంలోని జియోన్‌ అంధుల పాఠశాల శుక్రవారం వారి పరిణయ వేదికగా మారింది. విశాఖపట్నం పరదేశీపాలెంకు చెందిన శ్యామల జిల్లాలోని ప్రత్తిపాడుకు చెందిన కొండబాబు అనే అంధుడిని వివాహమాడింది.

  • అంధుడిని పెళ్లాడిన యువతి  
  • జియోన్‌ పాఠశాలలో వివాహ వేడుక
  • కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : 
    ‘వెలుగుకు నోచని నీ బతుకులో వేగుచుక్కనవుతా.. కొత్త వేకువనవుతా.. నీ కనులు చూడలేకపోయినా..నేనే నీ చూపై ఈ లోకాన్ని చూపిస్తా.. జీవితమంతా నీ తోడైనీడై ఉంటా..’ అంటూ ఓ యువతి అంధుడికి జీవితభాగస్వామి అయింది. రాజమహేంద్రవరంలోని జియోన్‌ అంధుల పాఠశాల శుక్రవారం వారి పరిణయ వేదికగా మారింది. విశాఖపట్నం పరదేశీపాలెంకు చెందిన శ్యామల జిల్లాలోని ప్రత్తిపాడుకు చెందిన కొండబాబు అనే అంధుడిని వివాహమాడింది. 
    25 ఏళ్ల శ్యామలకు చిన్ననాటి నుంచే అంధులంటే సానుభూతి. వారికి చేతనైనంత వరకూ చేదోడు వాదోడుగా నిలిచేది. ఆమె తమ్ముడు రేచీకటితో బాధపడి మృతి చెందాడు. కాగా 30 ఏళ్ల కొండబాబుకు మూడో ఏటే చూపు పోయింది.  జియోన్‌ అంధుల పాఠశాలలో చదువుకుని ప్రస్తుతం అక్కడే ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తున్నాడు. కొండబాబుకు వివాహం చేయాలనుకున్న పాఠశాల నిర్వాహకురాలు ఎస్తేరురాణి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆమెకు శ్యామల గురించి తెలిసి ం ది. స్వతహాగా అంధులంటే జాలీ, దయా ఉన్న ఆమెను కొండబాబుకి ఇచ్చి వివాహం చేస్తే వారి దాంపత్యజీవితం ఒడిదుడుకులు లేకుండా సాగుతుందని ఎస్తేరు రాణి భావించారు. శ్యామల కు టుంబసభ్యులను సంప్రదించారు. ముం దు నుంచే అంధులంటే సానుభూతి కలిగి న ఆమె కొండబాబును పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. శుక్రవారం ఇరుకుటుంబాల సమక్షంలో లాలాచెరువు హోస న్నా మందిరం పాస్టర్‌ జాన్‌వెస్లీ సమక్షంలో వివాహం జరిపించారు. ఈ జంట ను మేయర్‌ పంతం రజనీశేషసాయి, 50వ వార్డు కార్పొరేటర్‌ గుత్తుల మురళీధరరావు, పలువురు నగర ప్రముఖులు ఆశీర్వదించారు. 
    కాగా జేఎమ్‌ జ్యూయలర్స్‌ వధువుకు తాళిబొట్టును బహూ కరించి, ఆహూతులకు విందు ఏర్పాటు చేసింది. తుమ్మిడి బ్రదర్స్‌ వారు వధూవరులకు నూతన వస్త్రాలను, రవి షామియానా సప్లయ్‌ వారు టెంట్, ఇతర సామగ్రిని ఇచ్చారు. స్వర్ణాంధ్ర వ్యవస్థాపకుడు గుబ్బల రాంబాబు రూ.5 వేలు అందించారు. అం ధుల ఇబ్బందులు గమనిం చిన తనకు వారికి చేతనైన సాయం చేయాలనుండేద ని, ఈ క్రమంలోనే కొండబాబు ను పెళ్లి చేసుకున్నానని శ్యామల చెప్పింది. ఇంటర్‌ వరకూ చదివిన తాను కూడా ఉద్యోగం చేస్తానని చెప్పింది.
     
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement