కొడుకు చేతిలో హత్యకు గురైన ‘టార్జాన్‌’ నటుడి భార్య

Tarzan Star Wife Stabbed To Death By Their Son in California - Sakshi

కాలిఫోర్నియా : ‘టార్జాన్‌’ నటుడు రాన్‌ ఏలీ భార్య వాలెరీ లుండిన్‌ ఎలీ కొడుకు చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం కాలిఫోర్నియాలోని తమ నివాసంలో చోటుచేసుకుంది. వివరాలు.. మంగళవారం సాయంత్రం రాన్‌ ఎలీ కుటుంబంలో గొడవ మొదలైంది. ఇది గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించగా అప్పటికే ఆరవై ఏళ్ల లుండిన్‌ మరణించినట్లు తెలిపారు. అయితే తన శరీరంపై కత్తితో దాడి చేసినట్లు గాట్లు ఉన్నాయని, ఆమెను హతమార్చింది సొంత కుమారుడు  కామెరాన్ ఎలీ(30)గా పోలీసులు గుర్తించారు. కామెరాన్ ఆచూకీ కోసం గాలించగా.. ఇంటి వెలుపల అతడు కనిపించాడని, పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపి చంపేశామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. 

కాగా, ఇక్కడ జరిగిన ప్రమాదంలో రాన్‌ ఏలీకి ఏమైనా గాయాలు అయ్యాయా అనేది మాత్రం తెలియలేదు. అంతకముంతే అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతి చెందిన ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని, కుటుంబం మధ్య జరిగిన వివాదాల కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 1960లో వచ్చిన టెలివిజన్‌​ కార్యక్రమం టార్జాన్‌తో రాన్‌ ఎలీ ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. రాన్‌ ఏలీ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరి కుమార్తెలు(కిర్‌స్టెన్, కైట్‌ల్యాండ్) కాగా ఒక్కడే కుమారుడు. అంతేగాక హత్యకు గురైన వాలెరీ లుండిన్‌ ఒకప్పటి మిస్‌ ఫ్లోరిడా.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top