అదృశ్యమైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కోసం ముమ్మర గాలింపు | Software Engineer Rohitha Missing Case Found In Hyderabad - Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కోసం ముమ్మర గాలింపు

Jan 6 2020 10:38 AM | Updated on Jan 6 2020 7:03 PM

Software Engineer Rohitha Missing in Hyderabad - Sakshi

రోహిత (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: అదృశ్యమైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆచూకీ కోసం గచ్చిబౌలి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. చాదర్‌ఘాట్‌ ప్రాంతానికి చెందిన రోహిత నానక్‌రాంగూడలోని ఆపిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తకు దూరంగా ఉంటోంది.

నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని మంత్రి సెలెప్టియా అపార్ట్‌మెంట్‌లో స్నేహితులతో కలిసి ఉంటోంది. గత డిసెంబర్‌ 26న మధ్యాహ్నం ఇంట్లోనుంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. సెల్‌ ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ చేసి ఉండటంతో డిసెంబర్‌ 29న ఆమె సోదరుడు పరిక్షిత్‌ గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఐడీ కార్డుతో పాటు ల్యాప్‌టాప్‌ను ఫ్లాట్‌లోనే వదిలి వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా ఆదివారం ఆమె సికింద్రాబాద్‌ ప్రాంతంలో కనిపించినట్లు సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ సురేందర్‌ రెడ్డి సికింద్రాబాద్‌లోని ప్రాంతాల్లో సీసీ పుటేజీలు పరిశీలించినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement