నీటికుంటలో పడి చిన్నారి మృతి

Nine Years Children died After Fell Into Water Pond In kadapa - Sakshi

సాక్షి, ఓబులవారిపల్లె(కడప) : మండలంలోని కొర్లకుంట గ్రామానికి చెందిన పులి వైష్టవి (9) శనివారం  ప్రమాద వశాత్తు సంజీవపురం చెరువులోని నీటికుంటలో పడి మృతి చెందింది. బంధువుల కథనం మేరకు.. కొర్లకుంట గ్రామనికి చెందిన పులి సుబ్రమణ్యం కూమార్తె వైష్టవి, గ్రామానికి చెందిన తోటి పిల్లలతో కలిసి సంజీవపురం చెరువులోనికి సాయంత్రం బహిర్భూమికి వెళ్లారు. వైష్టవి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయి కేకలు వేసింది. తోటి పిల్లల కళ్లముందే ఆ చిన్నారి నీటి కుంటలో మునిగిపోయింది. విషయన్ని ఇంటికి వచ్చి పిల్లలు చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటహుటిన కుంటలోకి దిగి చిన్నారిని వెలికితీశారు. అప్పటికే మృతి చెందింది. పులి సుబ్రమణ్యం ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మంచాన పడి ఉన్నాడు. వారికి ఒక కూమారుడు కూమార్తె ఉన్నారు.  వైష్ణవి మృతితో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌ తెలిపారు.   వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను పరమర్శించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top