బడి బయటే బాల్యం | Child Labour In Kamareddy | Sakshi
Sakshi News home page

బడి బయటే బాల్యం

Jun 28 2018 1:30 PM | Updated on Jun 28 2018 1:30 PM

Child Labour In Kamareddy - Sakshi

ఎల్లారెడ్డి బస్టాండ్‌లో చిప్స్‌ ప్యాకెట్లు విక్రయిస్తున్న చిన్నారులు

కామారెడ్డి రూరల్‌: జిల్లాలో 6 ఏళ్లనుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలు 1,46,111 మంది ఉన్నారు. ఇందులో 1,45,443 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. 668 మంది పిల్లలు బడి బయటే గడుపుతున్నారు.  2016–17 సంవత్సరంలో సర్వే చేసిన అధికారు లు జిల్లావ్యాప్తంగా 447 మంది పిల్లలు బడిబయ ట ఉన్నట్లుగా గుర్తించారు.

వారిని నేషనల్‌ చైల్డ్‌ లేబర్‌ ప్రాజెక్టు కేంద్రాల్లో చేర్పించారు. అయినప్పటికీ వారిలోంచి చాలా మంది తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. వారు బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. కాగా 2017–18 విద్యాసంవత్సరం కోసం బాలకార్మికులను గుర్తించేందుకు పట్టణ ప్రాంతా ల్లో మెప్మా ఆధ్వర్యంలో, గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్‌ ఆధ్వర్యంలో సర్వే చేశారు. ఈ ఏడాది 668 మంది చిన్నారులు బడిబయట ఉన్నట్లుగా గుర్తించారు. గతేడాదితో పోలిస్తే బడి బయట ఉన్న పిల్లల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.  

పథకాలెన్ని ప్రవేశపెట్టినా... 

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. పథకాల అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం వల్లే ఆశించిన ఫలితాలు రావడం లేదన్న ఆరోపణలున్నాయి. తూతూమంత్రంగా బడిబాట నిర్వహించడంతో చాలా మంది పిల్లలు బడిబయటే ఉండి, చెత్త ఏరుకునేవారిగా, పశువుల కాపరులుగా, కార్ఖానాలు, హోటళ్లు, ఇటుకబట్టీల వద్ద కార్మికులుగా మారుతున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం 

బడి బయట పిల్లలు లేకుండా చూడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఏటా బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి నేషనల్‌ చైల్డ్‌ లేబర్‌ ప్రాజెక్టు కేంద్రాల్లో చేర్పిస్తున్నాం. జిల్లాలో ఇలాంటి కేంద్రాలు ఏడు చోట్ల ఉన్నాయి. బడిఈడు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.  

– గంగకిషన్, సెక్టోరియల్‌ అధికారి, కామారెడ్డి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement