చెండాలమైన పనితో బుక్కైన ఎస్పీ

Bangalore IPS Officer Illegal Affair with Techie Wife - Sakshi

సాక్షి, బెంగళూరు: నగరంలో షాకింగ్‌ వ్యవహారం​ వెలుగు చూసింది. బెంగళూరుకు చెందిన ఓ ఐపీఎస్‌ అధికారి.. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ టెక్కీ ఆరోపణలకు దిగాడు. అంతేకాదు సదరు అధికారితో తన భార్య అభ్యంతరకర స్థితిలో ఉన్న ఫోటోలు, వీడియోలను సైతం ఆ భర్త పోలీసులకు అందించటం గమనార్హం. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

వివరాల్లోకి వెళ్తే.. దేవాంగెరె ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌(40)కు 2010లో వివాహమైంది. రెండేళ్లపాటు అమెరికాలో ఉండి.. తిరిగి ఆ జంట నగరానికి వచ్చేసింది. భార్య గ్రాఫిక్ డిజైనింగ్ స్టూడియో నిర్వహిస్తున్న క్రమంలో.. గతేడాది ఆమె స్టూడియోకి ఎస్పీ భీమశంకర్‌ గులేద్‌ ఓ ఫోటో షూట్ కోసం వచ్చారు. ఆమెతో చనువుగా మాట్లాడి పరిచయం పెంచుకున్నాడు. అదికాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. తర్వాత ఇద్దరూ సిటీలో చక్కర్లు కొట్టడం, ఆ విషయం తనదాకా రావటంతో సదరు టెక్కీ భార్యను మందలించాడు. భర్తకు భయపడి కొన్నాళ్లు ఐపీఎస్ ఆఫీసర్‌ను కలవడం మానేసిన ఆమె, తర్వాత మళ్లీ కలవడం మొదలెట్టింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని భర్త... తన భార్య, ఐపీఎస్ ఆఫీసర్‌తో సన్నిహితంగా ఉన్న సమయంలో ఓ వీడియో తీశాడు. అంతేకాకుండా భార్య ఫోన్లో ఇద్దరు కలిసి ముద్దులు పెట్టుకుంటున్న వీడియోలను.. మొత్తం సాక్ష్యాలను సేకరించి ఫిర్యాదు చేశాడు. 

చంపుతానని బెదిరించాడు.. ఈ విషయంలో భీమశంకర్‌పై గతంలో చాలాసార్లు ఫిర్యాదులు చేశానని, కానీ, ఎవరూ పట్టించుకోలేదని సదరు టెక్కీ వాపోతున్నాడు. ‘భీమశంకర్‌ నన్ను చంపుతానని బెదిరించేవాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఎన్‌కౌంటర్‌లో చంపుతానన్నాడు. డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటంతో... ఇప్పుడు మేజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేశా’ అని సదరు ఇంజనీర్ వెల్లడించాడు. ఈ వ్యవహారంపై నాన్‌ కాగ్నిజబుల్‌ కేసు నమోదు చేసిన పోలీసులు.. న్యాయ నిపుణుల సలహా తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్లు చెబుతున్నారు.

వాళ్లు మాత్రం మరోలా... అయితే అతని ఈ వ్యవహారంలో టెక్కీ భార్య వివరణ మాత్రం మరోలా ఉంది. భర్తతో తనతో గొడవ పడి, వేరుగా ఉంటున్నాడని, ఆ కారణంగానే లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని ఆమె అంటోంది.  ఇక భీమశంకర్‌ వైఫ్‌ కూడా సంచలన ఆరోపణలు చేస్తోంది. భీమశంకర్‌ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ ఆమె సైతం పోలీసులను ఆశ్రయించటం కొసమెరుపు. అయితే భీమశంకర్‌ మాత్రం తన భార్య మానసిక పరిస్థితి బాగోలేదని, ఆమెను ప్రలోభపెట్టి కేసు పెట్టించారంటూ చెబుతున్నాడు. ఈ వరుస ట్విస్ట్‌ల మూలంగా కేసు కోసం రాష్ట్ర హోం శాఖ స్వయంగా రంగంలోకి దిగింది. హోంమంత్రి పరమేశ్వర ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top