ట్యాంపర్‌ ప్రూఫ్‌  ప్యాకింగ్‌తో ‘జొమాటో’ ఫుడ్‌

Zomato introduces tamper-proof packaging in 10 cities - Sakshi

ఆహార నాణ్యతపై మరింత దృష్టి

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ రెస్టారెంట్‌ గైడ్, ఫుడ్‌ డెలివరీ సేవల సంస్థ జొమాటో.. రెస్టారెంట్లు పంపిన ఆహార పదార్ధాలను మార్గం మధ్యలో ఎవరూ ఓపెన్‌ చేసేందుకు వీలులేకుండా గట్టి భద్రతా చర్యలను చేపట్టింది. ఇక నుంచి ట్యాంపర్‌ ప్రూఫ్‌ ప్యాకేజింగ్‌ టేప్స్‌తో ఫుడ్‌ డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ మధ్య ఓ డెలివరీ బాయ్‌ పార్సిల్‌ను ఓపెన్‌ చేసిన సంఘటన వైరల్‌ కాగా, అప్పట్లోనే ఇటువంటి నాణ్యతా చర్యను చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇందుకు అనుగుణంగా తొలుత దేశంలోని 10 నగరాల్లో ఈ తరహా సేవలను ప్రారంభించినట్లు బుధవారం ప్రకటించింది. పునర్వినియోగానికి వీలైన సింగిల్‌ మెటీరియల్‌ పాలిమర్‌తో ఫుడ్‌ డెలివరీ జరుగుతుందని తెలిపింది. తొలి దశలో ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, పూణె, జైపూర్, చండీగఢ్, నాగ్‌పూర్, వడోదరల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ సీఈఓ మోహిత్‌ గుప్తా తెలిపారు. ఈ దశలో 5,000 రెస్టారెంట్లు ట్యాంపర్‌ ప్రూఫ్‌ ప్యాకేజింగ్‌తో ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారాయన. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top