హైదరాబాద్లో యుటూ క్యాబ్ సేవలు | youtu cab services in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో యుటూ క్యాబ్ సేవలు

Oct 26 2016 1:41 AM | Updated on Sep 4 2017 6:17 PM

హైదరాబాద్లో యుటూ క్యాబ్ సేవలు

హైదరాబాద్లో యుటూ క్యాబ్ సేవలు

చెన్నైకు చెందిన క్యాబ్ సేవల సంస్థ ‘యుటూ’ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెన్నైకు చెందిన క్యాబ్ సేవల సంస్థ ‘యుటూ’ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఇతర క్యాబ్ సంస్థల మాదిరిగా కాకుండా నో సర్జ్ రేట్స్, కస్టమర్లకు రివార్డ్ పాయింట్లు తమ ప్రత్యేకతని యుటూ సీఈఓ కేవీపీ భాస్కరన్ మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారు. మరో రెండు నెలల్లో బెంగళూరులోనూ సేవలను ప్రారంభిస్తామని.. ఆ తర్వాత 6 నెలల్లో పుణె, అహ్మదాబాద్, కోచిలతో పాటూ మొత్తం 6 ప్రధాన నగరాలకు విస్తరిస్తామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో డాట్సన్ గో ప్లస్, నిస్సాన్ సన్నీ వాహనాలతో మొత్తం 105 వాహనాల సామర్థ్యం ఉందని.. ఈ ఏడాది ముగింపు నాటికి వీటి సంఖ్యను 750కు పెంచుతామని తెలియజేశారు. ప్రస్తుతం చెన్నైలో లక్ష యుటూ యాప్స్ డౌన్‌లోడ్ అయ్యాయని.. రోజుకు 850 ట్రిప్పుల బుకింగ్స్ పూర్తి చేస్తున్నామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement