ఉద్యోగాల మార్పు కోసం 49 శాతం మంది... | Over 50 percent young professionals to look for job change in 2017 | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల మార్పు కోసం 49 శాతం మంది...

Dec 22 2016 1:57 AM | Updated on Sep 4 2017 11:17 PM

వచ్చే ఏడాది చాలా మంది ఉద్యోగులు ఉద్యోగాలు మార్పు కోరుకుంటున్నారు.

టాలెంట్‌ఎడ్జ్‌ సర్వే..
ముంబై: వచ్చే ఏడాది చాలా మంది ఉద్యోగులు ఉద్యోగాలు మార్పు కోరుకుంటున్నారు. 2017లో దాదాపు 49%కి పైగా ఉద్యోగులు జాబ్‌ మారాలని భావిస్తున్నారని ఈడీ–టెక్‌ సంస్థ టాలెంట్‌ఎడ్జ్‌ తన నివేదికలో పేర్కొంది. ఇక 50%కి పైగా ఉద్యోగులు గణనీయమైన ఇంక్రిమెంట్‌ కోరుకుంటున్నారని తెలిపింది. ఉద్యోగాలు మారడానికి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే అంచనాలు కారణమని పేర్కొంది.

నివేదికలోని ప్రధానాంశాలు..
తమ భవిష్యత్‌ అంచనాలపై డీమోనటైజేషన్‌ ఎలాంటి ప్రభావం చూపలేదని సర్వేలో పాల్గొన్న చాలా మంది అభిప్రాయపడ్డారు.
నోట్ల రద్దు వల్ల రానున్న రోజుల్లో ఆర్థిక వ్య వస్థ బలమైన వృద్ధి బాటలో పయనిస్తుందని వారు అంచనా వేశారు.
25–30 ఏళ్ల వయసు గ్రూప్‌ ఉద్యోగులతో పోలిస్తే.. 21–24 ఏళ్ల వయసు గ్రూప్‌ వారు ఉద్యోగాలుమారడానికి ఆసక్తి చూపడం లేదు.
25–30 ఏళ్ల వయసులో ఉన్న ఉద్యోగులు వచ్చే ఏడాదిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆశావహంగా ఉంటే.. 21–24 ఏళ్ల వయసులో ఉన్న ఉద్యోగులు మాత్రం 2017లో ప్రమోషన్లు బాగుంటాయని ఆశిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement