కార్యకర్తలకు అండగా ఉంటాం

YSRCP Leaders Slams Chandrababu Naidu And TDP - Sakshi

జగన్‌పై హత్యాయత్నం టీడీపీ కుట్ర

వైఎస్సార్‌సీపీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య

కర్నూలు, ఆత్మకూరు: వైఎస్సార్‌సీసీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. కర్నూలులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆత్మకూరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ..  ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, ప్రజా సమస్యలను పరిష్కరిం చేందుకు కృషి చేస్తామన్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మండలాల నూతన కమిటీ సభ్యులను ఎంపిక చేసినట్లు తెలిపారు.  ప్రస్తుతం గ్రామాల్లో రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారని, ఏ గ్రామానికి వెళ్లినా ప్రజాదరణ తగ్గడంలేదన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, వర్షాలు కురవకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అవేవీ పట్టించుకోకుండా కేవలం కమీషన్లకు కక్కుర్తిపడి అక్రమాలకు పాల్పడుతున్నాడని  ఆరోపించారు.  వెలుగోడు రిజర్వాయర్‌ నుంచి సిద్ధాపురం ఎత్తిపోల పథకానికి సాగు నీరు అందించడంపై ఎమ్మెల్యే ఏ మాత్రం  శ్రద్ధ చూపకపోవడంతోనే పంటలు ఎండిపోయాయన్నారు. రైతులకు  అండగా ఉండి ఆదుకుంటామని చెప్పారు.  

జగన్‌పై హత్యాయత్నం అమానుషం   
రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షడు బీవీ రామయ్య అన్నారు. జగన్‌ పై హత్యాయత్నం టీడీపీ నాయకుల కుట్రేనని, ఇందుకు ప్రధానసూత్రధారుడు చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు.  ఈ సందర్భంగా శిల్పా, బీవై రమయ్యలను ఆత్మకూరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.  

పార్టీని మరింత బలోపేతం చేస్తాం  
ఎస్సీ సెల్‌ నంద్యాల  పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు  బాలన్న వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చక్రపాణిరెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బాలన్న అన్నారు.  ఎస్సీలను మరింత చైతన్య వంతులు చేసి వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.  కార్యక్రమంలో  వైఎస్సార్‌సీపీ మండల, పట్టణ అధ్యక్షలు చిట్యాల వెంకటరెడ్డి, అంజాద్‌ అలీ, యూత్‌ అధ్యక్షుడు సుల్తాన్, కౌన్సిలర్లు స్వామి, రాజగోపాల్, ముర్తుజా, షంషూర్, నాయకులు పాన్‌బాషా, యూనుస్, ఫరుక్, ఎలిషా, రాజమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పక్కా ప్లాన్‌ ప్రకారమే జగన్‌పై హత్యాయత్నం
కర్నూలు, నందికొట్కూరు: పక్కా ప్లాన్‌ ప్రకారమే వైస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హత్యకు   టీడీపీ కుట్రపన్నిందని  వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని వైస్సార్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఐజయ్య అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గాయపడిన వైఎస్‌ జగన్‌ను పరామర్శకుండా, సానుభూతి ప్రకటించకుండా  పబ్లిసిటి కోసమే దాడి చేయించుకున్నారని  ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం సిగ్గుచేటన్నారు. ఆపరేషన్‌ గరుడపై ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దల సహకాంతోనే నిందితుడు జగన్‌ హత్యకు పథకం రూపొంచుకున్నాడన్నారు. నిందితులు ఎంతటివారైన శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పట్టణంలోని సీఎస్‌ఐ టౌన్‌ చర్చిలో  ఎమ్మెల్యే, శిల్పా, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్దార్థరెడ్డి, పార్టీ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు చెరుకుచర్ల రఘురామయ్య, వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, కౌన్సిలరు శ్రీనివా సరెడ్డి, జిల్లా నాయకులు చంద్రమౌళి, కోకిల రమణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఏసన్న, ఆయా మండలాల నాయకులు లోకేష్‌రెడ్డి, రమాదేవి, తులసిరెడ్డి, వెంకటరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, చిన్న మల్లారెడ్డి, స్వామిరెడ్డి, చిట్టిరెడ్డి, రవికుమార్, తదితరులు  పాల్గొన్నారు.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top