రేణిగుంట బుగ్గవీధి వీధిలో గుర్తు తెలియని మహిళ హత్యకు గురైన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రేణిగుంట: రేణిగుంట బుగ్గవీధి వీధిలో గుర్తు తెలియని మహిళ హత్యకు గురైన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేణిగుంట పోలీసుల కథనం మేరకు.. బేల్దారి శివ బుగ్గవీధిలో నివాసముంటున్నా డు. తరచూ అతని ఇంటికి 35 సంవత్సరాల వయస్సు గల ఓ మహిళ వచ్చి వెళ్లేది. మూడు రోజులుగా తాళం వేసిన శివ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పక్కింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, సీఐ బాలయ్య, ఎస్‌ఐ మధుసూదన్‌రావు, ఏఎస్‌ఐ భక్తవత్సలం అక్కడికి చేరుకుని ఇంటి తాళం పగులగొట్టారు.
రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. డీఎస్పీ నంజుండప్ప స్థానికులను విచారిం చగా గురువారం రోజున శివ తన ఇం టికి వచ్చే మహిళతో గొడవపడినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఆయన కనబడడం లేదని తెలిపారు. శివే ఈ పని చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని అక్కడే ఉంచి సోమవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. రేణిగుంట సీఐ బాలయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.