శిల్పారామంలో తెలుగు తమ్ముళ్ల వీరంగం | tdp workers create ruckus in anantapur silparamam | Sakshi
Sakshi News home page

శిల్పారామంలో తెలుగు తమ్ముళ్ల వీరంగం

May 22 2014 12:11 PM | Updated on Aug 11 2018 4:03 PM

తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. అనంతపురం శిల్పారామంలో విధ్వంసం సృష్టించారు.

తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. నిన్న కాక మొన్న తిరుపతిలో టీడీపీ నాయకులు మద్యం తాగివచ్చి దుకాణాలను ధ్వంసం చేయగా, ఇప్పుడు అనంతపురంలో కూడా అదే తరహాలో ప్రవర్తించారు. (చదవండి: తిరుమలలో తెలుగు తమ్ముళ్ల వీరంగం)

అనంతపురం పట్టణంలో ఉన్న శిల్పారామానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు అక్కడున్న ఫర్నిచర్ను, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపైన, ఇతర కార్యకర్తలు, నాయకులపైన శిల్పారామం కాంట్రాక్టర్ వేణుగోపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement