
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తానేటి వనిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. అంగన్‌వాడి వర్కర్ల ఫైలుపై మొదటి సంతకాన్ని చేశారు. మంత్రి పదవి ఇచ్చినందుకు, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. మహిళలు, వృద్దులు, పిల్లల అభివృద్దికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పసిపిల్లలు, మహిళలపై జరగుతున్న అరాచకాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళలు, పిల్లల భద్రతకు కఠిన చట్టాలు తీసుకొస్తామని ప్రకటించారు.
డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆళ్ళ నాని
ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆళ్ల నాని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో తన చాంబర్‌లో సర్వమత ప్రార్థనల అనంతరం ఆళ్ల నాని మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆళ్ల నానికి పశ్చిమ గోదావరి జిల్లా శాసన సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.