కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద గురువారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
వెల్దుర్తి(కర్నూలు): కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద గురువారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఐషర్ లారీ చెరుకలపాడు వద్ద ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐషర్ డ్రైవర్ అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన నారాయణ స్వామితోపాటు క్యాబిన్‌లో ఉన్న మరో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు.
పోలీసులు, 108 వాహన సిబ్బంది వెంటనే సంఘటన స్థలికి చేరుకుని, క్యాబిన్‌లో ఇరుక్కున్న వారిని రక్షించే ప్రయత్నం చేసినా వీలుకాలేదు. దీంతో వారు అందులోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.