రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర ఉద్యమం రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో ముందుకు సాగుతోంది.
శ్రీకాకుళం: రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర ఉద్యమం రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో ముందుకు సాగుతోంది. గత నెల 30న కేంద్రం ప్రభుత్వం విభజనపై తమ నిర్ణయాన్ని ప్రకటించిన నాటి నుంచి సీమాంధ్రలో ఉద్యమ వాతావరణం నెలకొంది.
సీమాంధ్ర జిల్లాలో విభజనకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా రణస్థల మండల కేంద్రంలో వికలాంగులు మానవహారం పాటించారు. ఈ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులతోపాటు మహిళలు కూడా పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జి సిగడామ్ మండలం పాలఖండీయ వద్ద ఉపాధ్యాయులు, విద్యార్థులు వంటావార్పు కార్యక్రమాలు చేపట్టారు.