ఆపరేషన్ రెడ్‌లో 22 మంది అరెస్టు | Operation Red 22 people arrested | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ రెడ్‌లో 22 మంది అరెస్టు

Mar 5 2015 1:57 AM | Updated on Sep 2 2017 10:18 PM

ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి జిల్లా పోలీసు శాఖ ప్రారంభించి న ఆపరేషన్ రెడ్‌లో ఐదుగురు బడా స్మగ్లర్లు పట్టుబడ్డారు.

వీరిలో ఐదుగురు బడా స్మగ్లర్లు
రూ.10 లక్షల విలువైన దుంగలు స్వాధీనం
ఎస్పీ శ్రీనివాస్ వెల్లడి
 

చిత్తూరు (అర్బన్):  ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి జిల్లా పోలీసు శాఖ ప్రారంభించి న ఆపరేషన్ రెడ్‌లో ఐదుగురు బడా స్మగ్లర్లు పట్టుబడ్డారు. వీరితోపాటు వారి అనుచరులుగా పనిచేస్తున్న మరో 17 మందిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం చిత్తూరులోని జిల్లా పోలీసు అతిథిగృహంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆ వివరాలను వెల్లడిం చారు. నిందితుల నుంచి మూడు వాహనాలు, 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోగా, వీటి విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను రెండు రోజుల్లో గంగాధరనెల్లూరు, గుడిపాల, చిత్తూరుటూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ కథనం మేరకు...

 గంగాధరనెల్లూరు పరిధిలో..

గంగాధరనెల్లూరు పోలీసుస్టేషన్ పరి ధిలో ఎనిమిది మంది ఎర్ర దొంగల్ని అరెస్టు చేశారు. వీరిలో పేరుమోసిన ఐదుగురు స్మగ్లర్లు ఉన్నారు. చిత్తూరు రూరల్ మండలం తుమ్మిందపాళ్యంకు చెందిన గౌస్ అనే అహ్మద్ (33) ఆపరేషన్‌రెడ్‌లో మోస్ట్‌వాంటెడ్ కింగ్‌పిన్. అలాగే 2011 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ బడా స్మగ్లర్లుగా పేరు మోసిన బాబు, రమేష్, వసంత్‌తో పరిచయాలు పెంచుకుని ఇప్పటి వరకు 200 టన్నుల ఎర్రచందనాన్ని ఎగుమతిచేశాడు. ఇతని వార్షిక ఆదాయం రూ.కోటి.ఇతనిపై జిల్లాలో 40 కేసులు ఉన్నాయి.

చిత్తూరులోని బాలాజీ కాలనీకి చెందిన కేఎస్.మధు అనే శ్రీనివాసులు నాయుడు (35) ఎర్రచందనంలో పెలైట్‌గా జీవితం ప్రారంభించి స్మగ్లర్‌గా అవతారమెత్తాడు. ఇప్పటి వరకు 150 టన్నుల ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేశాడు. ఇతని నెలసరి ఆదాయం రూ.5 లక్షలు. ఇతనిపై 12 కేసులు ఉన్నాయి.చిత్తూరు లాలూగార్డెన్‌కు చెందిన లెఫ్ట్ మున్నా (33) కర్ణాటకకు చెందిన స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుని స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇతనిపై 18 కేసులున్నాయి. లాలూగార్డెన్‌కు చెందిన మరోస్మగ్లర్ దాడి మున్నా(32) బడా స్మగ్లర్. ఇతనిపై జిల్లాలో 18 కేసులు ఉన్నాయి. నగరంలోని కట్టమంచికి చెందిన ఖాలిక్ అనే పిచాండి (29)పై 17 కేసులు ఉన్నాయి. ఈ ఐదుగురితో పాటు వీరికి పెలైట్, డ్రైవర్లుగా ఉన్న తిరువన్నామలైకు చెందిన మురుగేష్(35), తుమ్మిందపాళ్యంకు చెందిన మురళి (40), సి.బాబు (30)ను పోలీసులు అరెస్టు చేశారు.

గుడిపాల పరిధిలో...

గుడిపాల పోలీసు స్టేషన్ పరిధిలో నగరికి చెందిన నవాజ్ (28), తుమ్మిందపాళ్యంకు చెందిన ఖాదర్‌భాషా అనే సేదు (33), మురళి అలియాస్ గజేంద్ర (24), రాజేష్ (26), చిత్తూరు రామ్‌నగర్‌కు చెందిన అబ్దుల్లా మస్తాన్ (26), పొద్దుటూరుకు చెందిన ఎంవీ.సుబ్బారెడ్డి అలియాస్ రాఘవరెడ్డి (25), హోసూరుకు చెందిన శబరీష్ (25) శక్తి అనే శివాజీ (24)లను అరెస్టు చేశారు.
 
టూటౌన్ పరిధిలో...

చిత్తూరు నగరంలోని టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో మనదపల్లెలోని బసినికొండకు చెందిన ఫయాజ్ బాషా అలియాస్ మక్బూల్‌బాషా (29), చిత్తూరులోని తుమ్మిందపాళ్యంకు చెందిన శరవణన్ అనే దూర్వాసులు (33), మురుగేశన్ (42), తమిళనాడులోని తిరువన్నామలైకు చెందిన ఏలుమలై అనే గోవిందన్ (32), పూతలపట్టుకు చెందిన రాజమని అనే చిన్నబ్బ (32), రమేష్ అనే మణి (30)లను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement