12న వైఎస్ జగన్ తిరుపతికి రాక | on 12th tirupati arrival of ys jagan | Sakshi
Sakshi News home page

12న వైఎస్ జగన్ తిరుపతికి రాక

Dec 10 2014 4:08 AM | Updated on Oct 30 2018 5:17 PM

12న వైఎస్ జగన్ తిరుపతికి రాక - Sakshi

12న వైఎస్ జగన్ తిరుపతికి రాక

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 12న తిరుపతికి వస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 12న తిరుపతికి వస్తున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కె.నారాయణస్వామి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతి పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రి 6.30 గంటల వరకూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, నేతలు, కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలతో సమావేశమవుతారు.

అదే రోజు రాత్రికి తిరుపతిలోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జరిగే ప్రవాస భారతీయుడు చెన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. అనంతరం పులివెందులకు బయలుదేరి వెళతారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా జిల్లాకు వస్తున్నందున పార్టీ శ్రేణులు తిరుపతికి తరలిరావాలని నారాయణస్వామి పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement