రిమాండ్‌ విధించిన గంటలోపే బెయిల్‌ | Nominal cases on sand mafia gang | Sakshi
Sakshi News home page

రిమాండ్‌ విధించిన గంటలోపే బెయిల్‌

May 5 2017 1:15 AM | Updated on Aug 28 2018 8:41 PM

ఇసుక మాఫియా ముఠాను అరెస్టు చేసి, రిమాండ్‌ కు తరలించిన గంటలోపే నిందితులందరూ బెయిల్‌పై బయటకొచ్చారు. పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే పటిష్టమైన రీతిలో కేసులు

‘ఏర్పేడు’ ఇసుకాసురులపై నామమాత్రపు కేసులు
 గనుల శాఖ అధికారులపై న్యాయస్థానం అక్షింతలు


రేణిగుంట(శ్రీకాళహస్తి): ఇసుక మాఫియా ముఠాను అరెస్టు చేసి, రిమాండ్‌ కు తరలించిన గంటలోపే నిందితులందరూ బెయిల్‌పై బయటకొచ్చారు. పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే పటిష్టమైన రీతిలో కేసులు పెట్టాల్సిన గనుల శాఖ అధికారులు ఏమయ్యారంటూ న్యాయస్థానం ప్రశ్నించినట్లు సమాచారం. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మునగల పాళెం గ్రామ శివారున స్వర్ణముఖీ నదిలో ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్న 10 మంది అధికార పార్టీ నాయకులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

వారిపై బలమైన సెక్షన్లు› పెట్టకుండా, ఐపీసీ 120(బీ), 21(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఇవి బెయిల బుల్‌ కేసులు కావడంతో అప్పటికే నిందితుల తరపు న్యాయవాదులు బెయిల్‌ పత్రాలతో సిద్ధంగా ఉండి రాత్రికి రాత్రే వారిని బయటకు తీసుకొచ్చారు. ఇసుక మాఫియా కేసుకు సంబంధించి వారంరోజులుగా పరారీలో ఉన్న వారిపై బెయిలబుల్‌ సెక్షన్లు నమోదు చేయరాదని నిబంధ నలు చెబుతున్నాయి.

 అయినా పోలీసు అధికారులు పైస్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి నామమాత్రపు కేసులతో చేతులు దులుపుకున్నా రు. ఇసుక అక్రమ రవాణా గత ఏడాదన్నరగా సాగుతున్నా గనుల శాఖ అధికారులు స్పందించకపోవడం పట్ల శ్రీకాళహస్తి అదనపు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ మొదటి తరగతి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement