అయ్యో.. మంత్రి అలా పడిపోయారేంటి? | Nimmakayala Chinarajappa Skids In Shuttle Court | Sakshi
Sakshi News home page

షటిల్‌ కోర్టులో జారిపడ్డ హోంమంత్రి

Oct 20 2018 8:03 PM | Updated on Oct 20 2018 8:28 PM

Nimmakayala Chinarajappa Skids In Shuttle Court - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వల్ప ప్రమాదానికి గురయ్యారు.

సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కుళాయి చెరువు వద్ద వివేకానంద పార్కును శనివారం ఆయన ప్రారంభించారు.

అనంతరం కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి సరదా కలిసి షటిల్‌ ఆడటానికి సిద్ధమయ్యారు. కొండబాబు కొట్టిన కాక్‌ను అందుకునే క్రమంలో కాలు జారి షటిల్‌ కోర్టులో పడిపోయారు. సెక్యురిటీ సిబ్బంది, అక్కడున్నవారంతా కలిసి ఆయనను వెంటనే పైకి లేవదీశారు. మంత్రికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఆయన అందరితో సరదాగా మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement