‘యూనివర్సిటీ ఘటనపై సీఎం సీరియస్‌గా ఉన్నారు’

Nannaya University Molestation Issue Vasireddy Padma Inquiry Into Matter - Sakshi

నన్నయ యూనివర్సిటీలో విద్యార్థినులపై వేధింపుల ఘటన

విచారణ నిర్వహించిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

సాక్షి, తూర్పుగోదావరి : ఆదికవి నన్నయ యూనివర్సిటీలో విద్యార్ధినులకు వేధింపుల వ్యవహారంపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ  మంగళవారం విచారణ నిర్వహించారు. యూనివర్సిటీలో వైస్ చాన్సలర్‌పై తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘నన్నయ్య యూనివర్సిటీలో అసాంఘిక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్‌ సీరియస్‌గా ఉన్నారు.
(చదవండి : కీచక అధ్యాపకుడిని నిలదీసిన మహిళలు..)

గురుతరమైన వృత్తిలో ఉన్న కీచక ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్రపై చర్యలు తీసుకోవడానికి వైస్ చాన్సలర్ ముందుకు రాలేదు. మహిళా సంఘాలు వచ్చిన తరువాతనే పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు’ అని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్‌ ఎన్‌. సూర్యరాఘవేంద్ర లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సోమవారం సస్పెండైన సంగతి తెలిసిందే.
(చదవండి : నన్నయా... కనవయ్యా)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top