లాక్‌డౌన్‌: ఆగని పడవ ప్రయాణం.. 

Migrant Workers Unstoppable boat journey in srikakulam district - Sakshi

సాక్షి,  ఇచ్ఛాపురం‌: బతుకు తెరువు కోసం చెన్నై వెళ్లిన వారుకష్టకాలంలో మళ్లీ స్వగ్రామాలకు వచ్చే స్తున్నారు. శనివారం రాత్రి ఒడిశా స్వర్ణాపురం గ్రామానికి చెందిన వలస మత్స్యకారులతో కలసి డొంకూరుకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారు లు ఒడిశా రేవుకు చేరుకోగా అక్కడ అధికారులు కేవిటి స్వర్ణాపురం క్వారంటైన్‌కు తరలించగా, సోమవారం మధ్యాహ్నం డొంకూరు గ్రామానికి చెందిన మరో ఐదుగురు మత్స్యకారులు డొంకూ రు సముద్ర తీరానికి బోటు గుండా చేరుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న రూరల్‌ ఎస్‌ఐ కె.లక్ష్మి వారిపై కేసు నమోదుచేసి స్థానిక మోడల్‌ స్కూల్‌ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. ఒడిశా రాష్ట్రం గోపాలపట్నం, స్వర్ణాపురం, రామయ్యపట్నానికి చెందిన 29 మందితో కలసి వీరంతా ఈ నెల 23న చెన్నైలో లక్షా 80వేల రూపాయలకు కొనుగోలు చేసి వచ్చినట్లు మత్స్యకారులు తెలిపారు. 

సముద్రంలో దూకి.. 
కవిటి: మండలంలోని పెద్దకర్రివానిపాలెం తీరంలో సోమవారం మధ్యాహ్నం ముగ్గురు మత్స్యకారులు మర పడవపై చెన్నై నుంచి రాగా.. వారిని పోలీసులు, రెవెన్యూ అధికారులు అదుపులోకి తీ సుకున్నారు. చెన్నై నుంచి ఈ నెల 22 రాత్రి వీరు మరబోటుపై ఇచ్ఛాపురం మండలానికి చెందిన ఐ దుగురితోపాటు బయలుదేరారు. పుక్కళ్లపాలెం కొత్తపాలెం తీరాల మధ్య ప్రదేశం వద్ద పహారా కా స్తున్న పోలీసులు బైనాక్యులర్‌ సాయంతో వీరిని గమనించారు. తీరంలో పోలీసులు ఉన్నారని గు ర్తించిన మత్స్యకారులు పెద్దకర్రివానిపాలెం వద్ద దిగాల్సిన వారిని పడవ నుంచి దూకి ఈతకొడుతూ వెళ్లిపోవాలని చెప్పడంతో.. ముగ్గురు తీరానికి కిలోమీటర్‌ దూరంలో దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. అప్పటికే సిబ్బందితో అక్కడున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రాజపురంలోని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. 

ఫ్లాష్‌.. ఫ్లాష్‌..
సోమవారం రాత్రి పొద్దుపోయాక చెన్నై నుంచి బోటపై వచ్చిన 18మంది మత్స్యకారులు పెద్దకర్రివానిపాలెం తీరంలో దిగారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి బీసీ హాస్టల్లోని క్వారంటైన్‌కు తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top