కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో కామినేని తనిఖీలు | kamineni srinivas invigilates the kakinada general hospital | Sakshi
Sakshi News home page

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో కామినేని తనిఖీలు

Mar 30 2015 10:25 AM | Updated on Sep 2 2017 11:36 PM

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు.

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. మంత్రి వస్తున్నాడని తెలిసి ఆస్పత్రి సిబ్బంది ఏసీలు అమర్చారు. రెండు గదులకు కొత్తగా రంగులు వేయించారు. అయితే ఆయన ఆస్పత్రికి వచ్చిన సమయంలో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో రోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రాత్రి వేలళ్లో వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఆస్పత్రి ఆవరణలో దోమలు విపరీతంగా ఉండటంతో బాలింతలు చిన్నారులకు రక్షణగా రాత్రంతా మేల్కొనే ఉన్నారు. కనీసం గర్భినీ స్త్రీలకు తగినన్ని పడకగదులు లేకపోవడంతో ఒక్కో బెడ్ పై ఇద్దరు చొప్పున వారికి వసతి సౌకర్యాలు కల్పించారు. అయితే కామినేని తనిఖీలతో తమకెలాంటి ప్రయోజనం లేదని రోగులు వాపోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement