
మెరకముడిదాం జెడ్పీ పాఠశాలకు సరఫరా చేసిన గుడ్డులో పురుగులు
మెరకముడిదాం: ఎప్పటిలాగానే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండేందుకు మెరకముడిదాం జెడ్పీ పాఠశాలలో వంట నిర్వాహకులు మంగళవారం సిద్ధమయ్యారు. వంటకు ఇవ్వాల్సిన సరుకులతో పాటు గుడ్లును కూడా ఇచ్చేందుకు పాఠశాల హెచ్‌ఎం గుడ్లు అట్టలలో నుంచి తీస్తుండగా అందులో పురుగులు వుండడాన్ని గమనించిన ఆయన అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే...
మెరకముడిదాం జెడ్పీ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనం వండేందుకు వంట నిర్వాహకులు రాగా వారికి మధ్యాహ్న భోజనం వండేందుకు బియ్యం, గుడ్లును ఇచ్చేందుకు హెచ్‌ఎం గుడ్లు అట్టలో నుంచి గుడ్లు తీశారు. ఈ క్రమంలో గుడ్లులో నుంచి పురుగులు వస్తుండడాన్ని హెచ్‌ఎం ఎం.శివున్నాయుడు గమనించారు. మిగిలిన గుడ్లును కూడా గమనించగా గుడ్లులో నుంచి పురుగులు వస్తుండగా మూడు గుడ్లు కుళ్లిపోయాయి. పురుగులు చూసి అవాక్కయిన హెచ్‌ఎం శివున్నాయుడు అన్ని గుడ్లును పరిశీలించారు. ఈ గుడ్లును ఐదు రోజుల కిందటే ఏజెన్సీ వాళ్లు పాఠశాలకు సంబంధించి 1300 గుడ్లును ఇచ్చారు.
అందులో ఈ రోజు తీసిన గుడ్లలో ఆరు గుడ్లులో నుంచి పురుగులు రావడం, అలాగే మరో మూడు గుడ్లు కుళ్లిపోవడాన్ని గమినించిన హెచ్.ఎం శివున్నాయుడు వెంటనే ఈ విషయాన్ని ఎంఈఓ దృష్టిలో పెట్టారు. ఏజెన్సీ వారికి కూడా సమాచారం ఇచ్చారు. గతంలో ప్రైవేటు వారు సరఫరా చేసినప్పుడు ఇలాంటి గుడ్లు ఎప్పుడు వచ్చేవి కావని, ఇప్పుడే ఇలాంటి కుళ్లిన గుడ్లు, పురుగులు పట్టిన గుడ్లు వస్తున్నాయంటున్నారు విద్యార్థులు. పాఠశాల హెచ్‌ఎం గుడ్లను తనిఖీ చేశారు కాబట్టి పురుగులు వున్నట్టు గుర్తించారు, లేకుంటే ఆ గుడ్లు మేము తిని వుంటే మా పరిస్థితి ఏమి కావాలి అంటూ పాఠశాల విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.