పిడుగు పాటుకు వృద్ధురాలు మృతి | elderly women dies after faling down thunder bolt in kurnool district | Sakshi
Sakshi News home page

పిడుగు పాటుకు వృద్ధురాలు మృతి

Oct 5 2015 6:09 PM | Updated on Apr 3 2019 8:07 PM

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో పిడుగు పడి వృద్ధురాలు మరణించింది.

ఆత్మకూరు రూరల్(కర్నూలు): కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో పిడుగు పడి వృద్ధురాలు మరణించింది. గ్రామానికి చెందిన కుందూరు లక్ష్మమ్మ(65) మరికొందరితో కలసి సోమవారం గ్రామ సమీపంలోని వరి పొలంలో కలుపు తీసేందుకు వెళ్లింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎండకాస్తుండగానే హఠాత్తుగా మబ్బులు కమ్ముకుని వర్షం మొదలైంది. దీంతో అంతా కలసి దగ్గర్లోనే ఉన్న చెట్టు కిందికి చేరుకున్నారు.

ఇంతలో పెద్ద శబ్దంతో పిడుగు ఆ చెట్టుపై పడింది. దీంతో లక్ష్మమ్మ అక్కడికక్కడే మరణించగా సమీపంలో ఉన్న కుందూరు నారాయణమ్మ, శేషమ్మ, లచ్చమ్మ స్పల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement