ఏర్పేడు ప్రమాదంలో కొత్తకోణం | cleaner ran lorry when Erpedu accident incident? | Sakshi
Sakshi News home page

ఏర్పేడు ప్రమాదంలో కొత్తకోణం

Apr 23 2017 10:46 AM | Updated on Sep 29 2018 5:26 PM

ఏర్పేడు ప్రమాదంలో కొత్తకోణం - Sakshi

ఏర్పేడు ప్రమాదంలో కొత్తకోణం

చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రమాద ఘటనలో కొత్తకోణం వెలుగు చూసింది.

తిరుపతి: చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రమాద ఘటనలో కొత్తకోణం వెలుగు చూసింది. ప్రమాదం జరిగిన సమయంలో లారీని డ్రైవర్‌కు బదులు క్లీనర్‌ నడిపినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. లారీని క్లీనర్‌ నడుపుతున్న దృశ్యాలు కడప సమీపంలో సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు కావడం గమనార్హం. డ్రైవర్‌ గురవయ్య లారీని నడిపినట్టుగా పోలీసులు చెబుతున్నారు. నాయుడుపేటలో లారీ యజమానిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. క్లీనర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇసుక అక్రమ దందాను ఆపివేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఏర్పేడు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తులపైకి లారీ అదుపు తప్పి దూసుకెళ్లి, తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన దుర్ఘటనలో 17 మంది దుర్మరణం చెందగా, మరో 15 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లారీ డ్రైవర్‌ మద్యం సేవించి ఉన్నాడని తెలిసింది. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.​

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement