ఏఎన్‌యూ పీజీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల | ANU PG Set Notification Release | Sakshi
Sakshi News home page

ఏఎన్‌యూ పీజీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Feb 22 2017 2:27 AM | Updated on Aug 17 2018 2:08 PM

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 2017–18 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే

ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 2017–18 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏఎన్‌యూ పీజీ సెట్‌–2017 నోటిఫికేషన్‌ను మంగళవారం రిజిస్ట్రార్‌ ఆచార్య కె.జాన్‌పాల్‌ విడుదల చేశారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.రామిరెడ్డి మాట్లాడుతూ ఏఎన్‌యూ పీజీ సెట్‌కు బుధవారం నుంచి ఏప్రిల్‌ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 20 వరకూ, తత్కాల్‌ విధానంలో రూ.1,000 ఫీజు చెల్లించి మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

మే 5, 6, 7 తేదీల్లో గుంటూరు, ఒంగోలు, విజయవాడల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. వివరాలకు www.anudoa.in,www.anu.ac.in వెబ్‌సైట్లను చూడొచ్చన్నారు.  ఏఎన్‌యూ దూరవిద్యాకేంద్రం గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన ఎంఈడీ, ఎల్‌ఎల్‌ఎం, డిప్లొమా ఇన్‌ యోగా కోర్సుల పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు దూరవిద్య పీజీ పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్‌ భవనం ఆంజనేయరెడ్డి తెలిపారు. ఫలితాలను www.anucde.info లో చూడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement