ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తూ ట్రాన్స్‌ఫార్మర్‌ను ముట్టుకొని తీవ్రంగా గాయపడ్డాడు.
గార్లదిన్నె(అనంతపురం) : ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తూ ట్రాన్స్‌ఫార్మర్‌ను ముట్టుకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలకేంద్రంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలకేంద్రానికి చెందిన షేక్ షావలి(12) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.
కాగా ఈ రోజు పాఠశాలకు సెలవు కావడంతోపాటు బంద్ ప్రభావం ఉండటంతో ఇంటి ముందు క్రికెట్ ఆడుకుంటున్నాడు. అయితే షేక్ షావలి బంతి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పడటంతో దాన్ని తీసుకురావడానికి వెళ్లాడు. బంతిని తీసే క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను ముట్టుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.