విశాఖ విద్య : ఏయూ పరిధిలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల, సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల (ఏ), మహిళా ఇంజినీరింగ్ కళాశాల, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల, డా. బి.ఆర్.అంబేడ్కర్ లా కళాశాల, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లలో తాత్కాలిక బోధనా నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏయూ క్యాంపస్ కళాశాలలలోని వివిధ విభాగాల్లో సెమిస్టర్ ప్రాతిపదికన క్లాస్‌వర్క్ బోధన కోసం అర్హులైన అభ్యర్థులను తాత్కాలిక బోధనా ఏర్పాట్ల కింద నియమించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత శాఖాధిపతులు కేటాయించిన బోధనా గంటల ప్రకారం ప్రతి సబ్జెక్టు/పేపర్‌కు గంటకు రూ.900, ప్రతి ల్యాబ్‌కు గంటకు రూ.600 చొప్పున పారితోషికం చెల్లిస్తారు. ఒక అభ్యర్థికి సెమిస్టర్‌కు గరిష్టంగా రూ.1.32 లక్షల వరకు పారితోషికం లభించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తులను జూన్ 22లోగా సమర్పించాలి. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు ఈ నెల 29 నుంచి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.


