సుస్థిర వ్యవసాయ పద్ధతులతో మేలు | - | Sakshi
Sakshi News home page

సుస్థిర వ్యవసాయ పద్ధతులతో మేలు

Jun 13 2026 1:29 PM | Updated on Jun 13 2026 1:29 PM

సుస్థిర వ్యవసాయ పద్ధతులతో మేలు

కొందుర్గు: రైతులు భూసార పరీక్షలను విధిగా చేయించుకోవాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్‌ ఖురేషి అన్నారు. నూనెగింజల ఉత్పత్తిని పెంపొందించడంలో భాగంగా భారత నూనెగింజల పరిశోధన సంస్థ హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో నూనెగింజలు పండించే గ్రామాలను ఎంపికచేశారు. మండలంఓని రేగడిచిల్కమర్రి గ్రామాన్ని ఎంపికచేసిన శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఖురేషి, డాక్టర్‌ శాంత, స్ఫూర్తి పౌండేషన్‌ హైదరాబాద్‌ ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ రత్నాకర్‌ రైతులకు నూనెగింజల సాగులో మెలకువలను వివరించారు. భూసార పరీక్షలపై అవగాహన కల్పించి పలువురి రైతుల పొలాల్లో మట్టి నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఖురేషి మాట్లాడుతూ.. నూనెగింజల ఉత్పాదకత, నేల సారవంతం, సుస్థిర వ్యవసాయ పద్ధతులు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయన్నారు. సమగ్ర పోషక నిర్వహణ, సేంద్రియ ఎరువుల వినియోగం, సమతుల్య రసాయన ఎరువుల వాడకం, సూక్ష్మజీవ ఆధారిత బయో ఇనాక్యులెంట్ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతు రవీందర్‌ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

శాస్త్రవేత్త డాక్టర్‌ ఖురేషి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement