కొత్తూరు: వర్షాకాలం కావడంతో అండర్‌పాస్ వద్ద వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్‌సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్‌ఉపాధ్యాయ అన్నారు. మున్సిపల్ పరిధిలోని అండర్‌పాస్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. రాయికల్ టోల్‌ప్లాజా ప్రాజెక్టు మేనేజర్ విశ్వనాథ్‌రాజుతో మాట్లాడి పలు సూచనలు చేశారు. 40హెచ్‌పీ మోటారుతో అండర్‌పాస్‌లోకి వస్తున్న వర్షపు నీటిని తీసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు టోల్‌ప్లాజా మేనేజర్ వివరించారు. అనంతరం ట్రాఫిక్ డీసీపీ మాట్లాడుతూ.. వర్షాకాలం కావడంతో అండర్‌పాస్‌లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ శంకరయ్య, సిబ్బంది పాల్గొన్నారు.


