ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల పరిధిలోని ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 11,12 తేదీల్లో నిర్వహించిన జాతీయస్థాయి ఇంట్రడక్షన్ టు రోబోటిక్స్ వర్క్‌షాప్ శుక్రవారం విజయవంతంగా ముగిసింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. రోబోటిక్స్, ఎంబయోడెడ్ సిస్టమ్స్, ఆటోమేషన్ రంగాలకు సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ పొందారు. కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ప్రారంభించగా, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ అబ్దుల్ నబీ, రీసెర్చ్ డెవలప్‌మెంట్ విభాగాధిపతి డాక్టర్ ధనలక్ష్మి రోబోటిక్స్ విద్య, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా క్విజ్, ఫీడ్‌బ్యాక్ సెషన్ నిర్వహించారు.


