సాయికుమార్‌పై పోక్సో కేసు | - | Sakshi
Sakshi News home page

సాయికుమార్‌పై పోక్సో కేసు

Jun 13 2026 1:29 PM | Updated on Jun 13 2026 1:29 PM

సాయికుమార్‌పై పోక్సో కేసు మహిళలకు స్వయం ఉపాధిలో శిక్షణ ఆరుట్ల స్కూల్‌లో అడ్మిషన్ల జాబితా విడుదల ముగిసిన సాంస్కృతిక శిక్షణ శిబిరం ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరి

ధారూరు: మండలంలోని కేరెళ్లి గ్రామానికి చెందిన సాయికుమార్‌(27)పై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. ఎస్‌ఐ రాఘవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సాయికుమార్‌ ప్రేమ పేరుతో 17 సంవత్సరాల బాలికను వంచించి అఘాయిత్యం చేశాడని తెలిపారు. తర్వాత పెద్దేముల్‌ మండలం మారెపల్లి సమీపంలోని గుడి వద్దకు తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడని వివరించారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సాయికుమార్‌పై కిడ్నాప్‌ కేసుతో పాటు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మొయినాబాద్‌: జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు స్వయం ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ ఆర్‌సెటీ డైరెక్టర్‌ మహ్మద్‌ అలీఖాన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్‌ పరిధిలోని చిలుకూరులో ఉన్న ఎస్‌బీఐ ఆర్‌సెటీ కేంద్రంలో నెల రోజుల పాటు మగ్గం వర్క్స్‌లో ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. 18–50 సంవత్సరాల వయసు ఉండి, పదో తరగతి చదివిన మహిళలు శనివారం ఆర్‌సెటీ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుకు ఎస్‌ఎస్‌సీ మెమో, రేషన్‌ కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌ కాపీలు, 4 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు జతచేయాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత హాస్టల్‌ వసతి, భోజన సౌకర్యంతోపాటు యూనిఫాం, టూల్‌ కిట్స్‌ అందజేస్తామన్నారు. వివరాలకు 85001 65190, 95506 06019 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

మంచాల: మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌లో అడ్మిషన్ల తుది జాబితా విడుదల చేశారు. పాఠశాల హెడ్‌ ఆఫ్‌ ది స్కూల్‌ గిరధర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో పేరెంట్స్‌ కమిటీ సమక్షంలో శుక్రవారం డ్రా తీశారు. మొత్తం 1,200 మంది దరఖాస్తు చేసుకోగా లాటరీ పద్ధతిలో 300 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న విద్యార్థుల జాబితాను పాఠశాలలో అందుబాటులో ఉంచారు. త్వరలో అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు.

మొయినాబాద్‌: ప్రజల జీవితాలతో మమేకమైన కళలు, సాహిత్యం సమాజ మార్పునకు శక్తివంతమైన ఆయుధాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాకురాలు విమలక్క అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో రెండు రోజులపాటు నిర్వహించిన సాంస్కృతిక శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కళాకారులు, సాంస్కృతిక కార్యకర్తలు పాల్గొని ప్రజా సాంస్కృతికోద్యమ కర్తవ్యాలు, శాసీ్త్రయ సోషలిజం, ఆదివాసీ కళలు, సాహిత్యం, సాంస్కృతిక ఆధిపత్య సిద్ధాంతం వంటి అంశాలపై చర్చించారు. కళాకారులకు డప్పు, పాట, నాటకం వంటి ప్రజా కళారూపాలపై శిక్షణ ఇచ్చారు. ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విమలక్క మాట్లాడుతూ.. శిక్షణ పొందిన కళాకారులు తమ కళలను సమాజ మార్పుకోసం ఉపయోగించాలన్నారు.

ట్రాఫిక్‌ సీఐ శంకరయ్య

షాద్‌నగర్‌రూరల్‌: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తూ వాహననాలను నడపాలని ట్రాఫిక్‌ సీఐ శంకరయ్య అన్నారు. శుక్రవారం ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని ఎలికట్ట చౌరస్తా సమీపంలో ట్రాఫిక్‌ సీఐ శంకరయ్య వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, వాహన పత్రాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. బైక్‌ నడిపేవారు హెల్మెట్‌, కారు నడిపేవారు సీట్‌ బెల్టు ధరించాలన్నారు. ప్రమాదరహిత సమాజ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెప్పపాటులో జరిగే ప్రమాదం కుటుంబాలను, జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement