పొలంలో రోడ్డు నిర్మాణం! | - | Sakshi
Sakshi News home page

పొలంలో రోడ్డు నిర్మాణం!

Jun 13 2026 1:29 PM | Updated on Jun 13 2026 1:29 PM

బషీరాబాద్‌: తన పొలంలో అధికార పార్టీకి చెందిన నాయకులు అక్రమంగా రోడ్డు నిర్మాణం చేశారని ఆరోపిస్తూ.. ముండల పరిధి క్యాద్గీరా గ్రామానికి చెందిన రైతు సిరెల్లి పెద్ద నాగప్ప కుటుంబీకులతో కలిసి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ.. ఇదే విషయమై గతంలో తాండూరు సివిల్‌ కోర్టు ఆదేశాల మేరకు అడ్వకేట్‌ కమిషనర్‌, డిప్యూటీ సర్వేయర్‌ సమక్షంలో మే 25న సర్వే చేసి, పిల్లనడక దారిని మాత్రమే వదిలారని పేర్కొన్నారు. అయినప్పటికీ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ వారి కుటుంబ సభ్యులు పంచాయతీ ట్రాక్టర్‌తో రెండు అడుగుల మేర నాపరాతి రాళ్లతో దారి వేసి, ఏర్పాటు చేసిన స్తంభాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఇదేమిటని ప్రశ్నించగాబెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌ జైపాల్‌రెడ్డిని వివరణ కోరగా.. రైతుల రవాణా సౌకర్యార్థం రోడ్డు వేశామని తెలిపారు.

పోలీసులకు బాధిత రైతు ఫిర్యాదు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement