దోమ: వ్యవసాయ కార్మిక సంఘం కార్మిక మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర స్థాయి మహాసభ కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలతో ప్రతీ ఒక్కరు ఇబ్బంది పడుతున్నారన్నారు. పెరుగుతున్న నిరుద్యోగం, పేదరికం, ఆకలి, వ్యవసాయ సంక్షోభం, గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని బలహీనపరిచే చర్యలు కార్మికుల జీవితాలను మరింత దుర్భరం చేస్తున్నాయని పేర్కొన్నారు. సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ నెల 20,21,22 తేదీల్లో మహబూబ్‌నగర్ పట్టణంలో సభలు నిర్వహిస్తున్నామని, కార్మిక, కర్షకులు, పేదలు, భూమిలేని కూలీలు హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సత్తయ్య, మండల కార్యదర్శి రఘురాం తదితరులు పాల్గొన్నారు.


