పూడూరు: అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని దళిత నాయకులు వెంకటయ్య అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మండల పరిధి మాటుగుడ గ్రామంలో నిర్వహించే అంబేడ్కర్ విగ్రహావిష్కరకు తరలిరావాలని కోరారు. శనివారం సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లేశం, పార్టీ మండల ఉపాధ్యక్షుడు రహీస్‌ఖాన్, దళిత నాయకులు లక్కం సత్యనారాయణ, నీరటి నర్సింలు, క్రిష్ణ పాల్గొన్నారు.
ఉపాధిని వినియోగించుకోండి
బొంరాస్‌పేట: ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వీబీ జి రామ్ జీగా పేరు మార్చడమే కాకుండా.. ఉపాధి పనిదినాలను 125లకు పెంచిందని బీజేపీ నాయకులు అన్నారు. శుక్రవారం మండల పరిధి ఏన్కెమీదితండాలో కూలీలకు ఫలహారం అందించారు. పని దినాలను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మాజీ కార్యవర్గ సభ్యుడు బాబయ్యనాయుడు, మండల అధ్యక్షుడు ఉప్పరి జగదీశ్వర్, నాయకులు నాగూరావు, సీహెచ్ నర్సింలు, ఉప్పు జగదీశ్, దశరథ్, సంతోష్ తదితరులున్నారు.
మహేశ్‌రెడ్డి అరెస్ట్ బాధాకరం
దోమ: రైతులు చేపట్టిన శాంతియుత నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించేందుకు వెళ్తున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిని అక్రమంగా చేశారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సర్పంచుల సంఘం జిల్లా మాజీ నేత రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం నగరం నుంచి పరిగి తన నివాసానికి వస్తున్న క్రమంలో మహేశ్‌రెడ్డిని పరిగి మండల పరిధి రంగాపూర్ గేట్ ప్రాంతంలో నిలిపి అరెస్టు చేయడం బాధాకరమన్నారు. ఆర్టికల్19(1) ప్రకారం ఎవరికై నా నిరసన, నిరాహార దీక్షలు చేపట్టే హక్కు ఉందన్నారు.
మసీదు కమిటీ అధ్యక్షుడుగా రజాక్
బషీరాబాద్: జామా మసీదు కమిటీ అధ్యక్షుడిగా అబ్దుల్ రజాక్‌ను మత పెద్దలు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఎండీ జహూర్‌ను నియమించారు. కమిటీలో మరో పది మంది సభ్యులు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ, మసీదు నిర్వహణతో పాటు ఇమామ్, మోజిన్‌లకు సంబంధించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.


