సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య

Jun 13 2026 1:29 PM | Updated on Jun 13 2026 1:29 PM

పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించండి

బడిబాటలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు

తాండూరు రూరల్‌: సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లోనే చేర్పించాలని జినుగుర్తి సర్పంచ్‌ శరణయ్య స్వామి అన్నారు. శుక్రవారం గ్రామంలో హెచ్‌ఎం నాగప్ప ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. ప్రైవేట్‌ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్య అందుతోందని, అనుభవమైన ఉపాధ్యాయులతో బోధన జరుగుతోందని చెప్పారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందిస్తోందన్నారు.

పెద్దేముల్‌లో..

పెద్దేముల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాల ఆధ్వర్యంలో గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం ద్యావరి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. అనంతరం ఎస్‌ఐ ప్రశాంత్‌వర్ధన్‌ను కలిసి షీటీం.. బాల్య వివాహాలపై అవగాహన కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు శ్రీధర్‌, జయశ్రీలు ఉన్నారు.

బడీడు పిల్లలను..

దోమ: ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని, బడీడు పిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లితండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మండల విద్యాధికారి వెంకట్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధి మోత్కూర్‌, దిర్సంపల్లి గ్రామాల్లో సర్పంచులు ఆనంద్‌, విజయలక్ష్మి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలసి బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement