రైతుల భూములు లాక్కుంటున్న ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రైతుల భూములు లాక్కుంటున్న ప్రభుత్వం

Jun 13 2026 1:29 PM | Updated on Jun 13 2026 1:29 PM

పూడూరు: నేల తల్లిని నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న రైతుల భూములను.. అభివృద్ధి పేరిట ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటుందని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ఆరోపించారు. శుక్రవారం మండల పరిఽధి మన్నెగూడలో ఆయన మాట్లాడారు. రేవంత్‌ బ్రదర్స్‌ భూముల దందా చేస్తూ.. రైతులను రోడ్డు పాలు చేస్తున్నారని విమర్శించారు. రాపోల్‌, కాడ్లాపూర్‌ గ్రామాల రైతుల పొలాలను ఫార్మాసిటీ పేరిట బలవంతంగా గుంజుకోవడం ఏంటని ప్రశ్నించారు. రైతుల పక్షాన నిలబడిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిని అడ్డుకుని, చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌లో తరలించడం దారుణమన్నారు. నగరం నుంచి ఇంటికి వెళ్తున్న తనను పోలీసులు వెళ్లనీయకపోవడం సరైందికాదన్నారు. మహేశ్‌రెడ్డిని వెంటనే వదిలిపెట్టాలని పార్టీ శ్రేణులతో కలసి హైదరాబాద్‌ బీజాపూర్‌ జాతీయ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంట పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం మహేశ్‌రెడ్డిని వదిలిపెట్టారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి గట్టు రాంచందర్‌రావు, మాజీ ఎంపీపీ మల్లేశం, సొసైటీ మాజీ చైర్మన్‌ నర్సింహారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు రహీస్‌ఖాన్‌, వైస్‌ ఎంపీపీ మల్లేశం, బీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement