బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి | - | Sakshi
Sakshi News home page

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి

Jun 13 2026 1:29 PM | Updated on Jun 13 2026 1:29 PM

అనంతగిరి: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వారిని పనిలో పెట్టుకోరాదని మదన్‌పల్లి సర్పంచ్‌ బిల్లపాటి విజయలక్ష్మి అన్నారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆమె ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్‌ సెల్‌ న్యాయవాది వెంకటేశం మాట్లాడుతూ.. 14 ఏళ్లలోపు బాలబాలికలు ఎలాంటి పనులు చేసినా నేరమని, బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం 18 ఏళ్లలోపు వారు ప్రమాదకర పనులు చేయడం నిషేధమన్నారు. సాధన ఎన్‌జీవో జిల్లా కోఆర్డినేటర్‌ నర్సింలు మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లాలో అనేక కార్యక్రమాలు అధికారుల సమన్వయంతో పనిచేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ వెంకటేశ్వరమ్మ, ఏహెచ్‌టీయూ ఇన్‌చార్జి అలిమొద్దీన్‌, షీటీం ఇన్‌చార్జి బుచేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేష్‌, ఆడపిల్లల సమానత్వ సమాఖ్య అధ్యక్షురాలు కీర్తన, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ షాలిని, అంగన్‌వాడీ టీచర్లు, ఉపాద్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement