హాకీ సీనియర్‌ పురుషుల జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

హాకీ సీనియర్‌ పురుషుల జట్టు ఎంపిక

Jun 13 2026 1:29 PM | Updated on Jun 13 2026 1:29 PM

తిరుపతి ఎడ్యుకేషన్‌ : తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా హాకీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా సీనియర్‌ పురుషుల జట్టు ఎంపికను గురువారం నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు హాజరైన క్రీడాకాలకు పోటీలు నిర్వహించి, జట్టును ఎంపిక చేశారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహిస్తున్న 16వ ఏపీ హాకీ సీనియర్‌ పురుషుల రాష్ట్ర స్థాయి పోటీల్లో తిరుపతి జిల్లా జట్టు పాల్గొననుంది. జిల్లా జట్టుకు ఎంపికై న హాకీ క్రీడాకారులను హాకీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంజన్‌రాజ్‌, ఆదిత్య, కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్‌కృష్ణ అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement