ముకరం జా అంతిమ సంస్కారాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు  | Sakshi
Sakshi News home page

Hyderabad: ముకరం జా అంతిమ సంస్కారాల నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు 

Published Wed, Jan 18 2023 10:34 AM

Traffic Restrictions In Hyderabad Ahead Of Mukarram Jah Funeral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టర్కీలోని ఇస్తాంబుల్‌లో కన్నుమూసిన ఎనిమిదో నిజాం ముకరం జా అంతిమ సంస్కారాలు బుధవారం మక్కా మసీదు ప్రాంగణంలో జరగనున్నాయి. వీటి నేపథ్యంలో పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు విధిస్తూ అదనపు సీపీ జి.సుధీర్‌ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఉదయం 8 నుంచి అంతిమ సంస్కారాల తంతు పూర్తయ్యే వరకు ఓల్గా జంక్షన్, ముర్గీ చౌక్, చెలాపుర మహిళ ఠాణా, మిట్టీకా షేర్, మూసాబౌలి జంక్షన్, హిమ్మత్‌పుర జంక్షన్‌ కేంద్రంగా ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయి. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. 

మరోపక్క బుధవారం ఉప్పల్‌లో జరిగే భారత్‌–న్యూజిల్యాండ్‌ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ జరుగనుంది. నగరంలోని వివిధ హోటళ్లలో బస చేసిన క్రికెటర్లు రోడ్డు మార్గంలో ఉప్పల్‌ వెళ్తున్నారు.

వీరి రాకపోకల నేపథ్యంలో బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల మధ్య సోమాజిగూడ, గ్రీన్‌ ల్యాండ్స్, బేగంపేట, రసూల్‌పురా, సీటీఓ, ఎస్బీఐ జంక్షన్, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌ జంక్షన్, ఆలుగడ్డ బావి, మెట్టగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్‌ఐ, ఉప్పల్‌ మార్గంలో కొన్ని ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.  

Advertisement
 
Advertisement