సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చిత్రంలో మంత్రులు జూపల్లి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు
వనరుల సమీకరణపై అశ్రద్ధను సహించం
అధికారులు రాష్ట్ర ఆదాయం పెంచాలి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: భూముల మార్కెట్ విలువలను సవరించి మే మొదటి వారం నుంచి అమలు చేయాలని రిజి్రస్టేషన్ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించింది. వనరుల సమీకరణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను అధికారులు స్పష్టంగా అమలు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని చెప్పారు. అశ్రద్ధ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీ శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పారిశ్రామిక ఎస్టేట్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు.
ప్రజాస్వామ్యయుతంగా హిల్ట్ పి
హిల్ట్ పి (హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ)ని వేగంగా అమలు చేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెచ్చిన ఈ పాలసీని ప్రజాస్వామ్యయుతంగా అమలు చేస్తామని అన్నారు. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించే విషయంలో అందరి అభిప్రాయాలను తీసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. ఓఆర్‌ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తే మంచిదని, చైనా తరహాలో ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని ఇండ్రస్టియల్ ఎస్టేట్స్ ప్రతినిధులు చేసిన సూచనలను స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు బాగా నడవాలని, హిల్ట్ పి విషయంలో ప్రభుత్వం చాలా ఓపెన్‌గా ఉందని పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
హిల్ట్ పాలసీ అమలుకు గడువివ్వండి
హిల్ట్ పాలసీని స్వాగతిస్తున్నామని చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య పారిశ్రామికవాడలను అభివృద్ధి, అభివృద్ధి చెందని భూములుగా పరిగణనలోకి తీసుకుని పారిశ్రామిక వేత్తలకు సహకరించాలని కోరారు. ఓఆర్‌ఆర్ బయట ఏర్పాటు చేసే ఇండ్రస్టియల్ పార్కుల్లో కారి్మకులు, ఉద్యోగులకు కనీస వసతి సౌకర్యాలు క ల్పిం చాలని విజ్ఞప్తి చేశారు.
పాలసీ అమలుకు ఆరు నెలల గడువు కావాలన్నారు. కన్వర్షన్ చార్జీలను తగ్గించాలని ఉప్పల్ పారిశ్రామికవాడ కార్యదర్శి సత్యనారాయణ కోరారు. సబ్సిడీలు లేకపోయినా ‘ప్యూర్’లో పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయాలని జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంత అధ్యక్షుడు నరేంద్రబాబు సూచించారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు శశాంక, కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


