Hyd: అంబర్‌పేట కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం | Fire Accident In amberpet Cars Showroom | Sakshi
Sakshi News home page

Hyd: అంబర్‌పేట కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం

Apr 27 2026 3:52 PM | Updated on Apr 27 2026 5:33 PM

Fire Accident In amberpet Cars Showroom

హైదరాబాద్‌:  నగరంలోని అంబర్‌పేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం( ఏప్రిల్‌ 27వ తేదీ) మధ్యాహ్న సమయంలో అంబర్‌పేటలోని మహేంద్ర, రెనాల్ట్‌ కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. కార్ల షోరూమ్‌లో మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో  చుట్టు పక్కల అంతటా పొగ భారీగా కమ్ముకుంది. 

ఈ అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. రెండు ఫైరింజన్లతో అక్కడకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది భారీగా ఎగిసిపడుతున్న అదుపులోకి తెచ్చే యత్నం చేస్తున్నారు. పొగ భారీగా వ్యాపించడంతో చుట్టుపక్కల నివాసాల వారిని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. 

కార్ల పార్క్‌ చేసిన చోట ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.  వాహనాలు పార్క్‌ చేసిన చోట అగ్ని ప్రమాదం జరగ్గా, ఆ మంటలు వేగంగా అన్ని కార్లకు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు చెబుతున్నారు. 

అంబర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement