రిటైర్మెంట్‌ ఫైల్‌పై సంతకానికి లంచం | Bribe for signing retirement file | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ ఫైల్‌పై సంతకానికి లంచం

Apr 9 2026 4:02 AM | Updated on Apr 9 2026 4:02 AM

Bribe for signing retirement file

ఏసీబీకి చిక్కిన ఇన్‌చార్జి ఎంఈఓ, స్కూల్‌ అసిస్టెంట్‌

గూడూరు: ఉత్తమ ఉపాధ్యాయుడిగా గతంలో అవార్డు పొందిన ఓ ప్రధానో పాధ్యాయుడి రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ఫైల్‌పై సంతకం చేసేందుకు లంచం తీసుకుంటూ ఓ ఇన్‌చార్జి ఎంఈఓ, స్కూల్‌ అసిస్టెంట్‌ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా గూ డూరు మండలంలోని గుండెంగ శివారు వాగ్యతండా ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న దయ్యాల రవీందర్‌ ఈ నెల 30న రిటైర్‌ కానున్నారు. 

తన రిటై ర్మెంట్‌ ప్రయోజనాల ఫైల్‌ను 3 నెలల ముందే హైద రాబాద్‌లోని ఆడిట్‌ ఆఫీసుకు పంపాల్సి ఉండటంతో అందుకోసం రవీందర్‌ అయోధ్యపురం జెడ్పీ హెచ్‌ఎస్‌ హెచ్‌ఎం, ఇన్‌చార్జి ఎంఈఓ జె.రవికుమార్‌ను సంప్రదించారు. అయితే ఫైల్‌పై సంతకా నికి రవికుమార్‌ రూ. 50 వేలు డిమాండ్‌ చేసి చివరకు రూ. 45 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. తొలివిడతగా బుధవారం రూ. 15 వేలు తీసుకోవడానికి సిద్ధమ య్యాడు. 

ఈ విషయాన్ని రవీందర్‌ వరంగల్‌లోని ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. దీంతో వలపన్నిన ఏసీబీ అధికారులు.. బుధవారం అయోధ్యపురం పాఠశాలలో రవికుమార్, చంద్రమౌళి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి గురువారం వరంగల్‌ ఏసీబీ కోర్టు ద్వారా కస్టడీకి తరలిస్తామని డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement