సూర్యాపేట : బాధితులకు తక్షణ భరోసా, రక్షణ కల్పించడమే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ కె.నరసింహ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డితో కలిసి పోలీసు అధికారుల నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలు, కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు. గత నెలలో నమోదైన కేసుల పూర్వపరాలను పరిశీలించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. బాధితుల ఇంటి వద్ద నుంచి కేసు నమోదు చేసే విషయంలో అలసత్వం వహించవద్దన్నారు. సమావేశంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీసీఆర్బి డీఎస్పీ రవి, ఏఆర్ డీఎస్పీ నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ మగ్దూం అలీ, సీఐలు రాజశేఖర్, వెంకటయ్య, నాగేశ్వరరావు, శివశంకర్, చరమందరాజు, రామకృష్ణారెడ్డి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్పెపక్టర్ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.


