సర్‌ పేరుతో ఓట్ల తొలగింపునకు కుట్ర | - | Sakshi
Sakshi News home page

సర్‌ పేరుతో ఓట్ల తొలగింపునకు కుట్ర

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

అర్వపల్లి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పేరుతో రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలు, కాంగ్రెస్‌ సానుభూతిపరుల ఓట్లను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. శనివారం అర్వపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 1205 బూత్‌లలో ఏ ఒక్క బూత్‌లోనూ కాంగ్రెస్‌ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా పార్టీ ఆధ్వర్యంలో బీఎల్‌ఏలను సమాయత్తం చేస్తున్నట్లు చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణపై కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందన్నారు. బీజేపీ కుట్ర పూరితంగానే నట రాజన్‌ను రాజ్యసభ సభ్యురాలు కాకుండా చేసిందన్నారు. అక్రమంగా, అన్యాయంగా నామినేషన్‌ తిరస్కరణ జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఈసీల ద్వారా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతోందని పేర్కొన్నారు. చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు దరూరి యోగానందచార్యులు, డీసీసీ ఉపాధ్యక్షుడు అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మోరపాక సత్యం, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శిగ నసీర్‌గౌడ్‌, సర్పంచ్‌లు చిల్లంచర్ల విద్యాసాగర్‌, బింగి కృష్ణమూర్తి, మంచాల లలితారామ్మూర్తి, నాయకులు మేకల రాంబాబు, బైరబోయిన మహరాజు, జె.సోమయ్య, బాసపోలు శ్రీనివాస్‌, బింగి శ్రీకాంత్‌, విజయ్‌, ఖాజ, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

ఫ డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement