భానుపురి (సూర్యాపేట) : మాజీ సర్పంచ్‌ల పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ డీజీపీ సీవీ ఆనంద్‌కు తెలంగాణ సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 31 నెలలైనా మాజీ సర్పంచ్‌ల బిల్లులు చెల్లించడం లేదన్నారు. ఆర్థిక ఇబ్బందులతో మాజీ సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి నిరసన చేపట్టబోతే ముందే అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. వినతిపత్రం అందించి వారిలో సంఘం కార్యదర్శి కేశబోయిన మల్లయ్యయాదవ్, వై. అరవింద్‌రెడ్డి, సముద్రాల రమేష్, తదితరులు ఉన్నారు.


