మహిళా రిజర్వేషన్‌పై
పోస్టుకార్డు ఉద్యమం చేపట్టాలి
ఆలేరు: మహిళల సంక్షేమం, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆలేరు పట్టణంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మహిళా కార్యకర్తలు కీలకం అన్నారు. మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మీనాక్షినటరాజన్‌కు రాజ్యసభ అవకాశం రాకుండా కుట్రలు చేయడం మహిళల పట్ల బీజేపీ నిజమైన వైఖరికి నిదర్శనమన్నారు. ఇప్పటి వరకు ఓట్ల దోపిడీకి పాల్పడిన బీజేపీ, ఇప్పుడు సీట్ల దోపిడీకి కూడా ప్రయత్నించడంపై మండిపడ్డారు. కొత్తగా వివాహమైన మహిళల పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా మహిళా కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
మీనాక్షి నటరాజన్ నామినేషన్‌పై కుట్ర
భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి కేసు నమోదు కాలేదని, కేవలం ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఆమె రాజ్యసభ నామినేషన్‌ను అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమేనని, కాంగ్రెస్‌ను ఇబ్బందులకు గురి చేయాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టారని ఆయన విమర్శించారు. మహిళా రిజర్వేషన్‌లపై ఇప్పుడు బిల్లు పెట్టినా ఓటు వేయడానికి కాంగ్రెస్ సిద్ధమేనన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలే కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తాయన్నారు. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేకపోవడంతో ఆలేరు మున్సిపల్ చైర్‌పర్సన్ బీజన బాలమణి అలిగి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్లు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ (33శాతం) బిల్లును తక్షణమే అమలు చేయాలనే డిమాండ్‌తో పోస్ట్ కార్డులపై మహిళల సంతకాలు సేకరించి వాటిని నేరుగా ప్రధాని నరేంద్రమోదీకి పంపే ఉద్యమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆలేరులో ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశంలో పోస్టుకార్డుల రాసి ప్రదర్శించారు. గ్రామగ్రామాన తిరుగుతూ మహిళలను చైతన్య పరిచి, పోస్టుకార్డుల ద్వారా తమ అభిప్రాయాన్ని నేరుగా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.
ఫ మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడంలో కేంద్రం విఫలం
ఫ సీట్ల దోపిడీకి పాల్పడుతున్న బీజేపీ
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
ఫ ఆలేరులో ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశం


